ఉద్యోగం వేటలో మనం చెయ్యకూడని విషయాలు – 1
మొన్నొక రోజు ఒక రిక్రూటర్ మిత్రుడు ఫోన్ చేశాడు. చాలా కాలంగా ఫ్రెండ్.
నేను : ఏంట్రా చెప్పు !
రిక్రూటర్ మిత్రుడు : అబ్బ పిచ్చెక్కి పోతోంది రా, ఒక పక్క క్లయింట్ ( కంపెనీలూ ) లతోటీ, మరొక పక్క ఉద్యోగ అభ్యర్దులతోనీ ! రక రకాల సినిమాలు చూపిస్తున్నారు !
నేను(పైశాచికంగా నవ్వుతూ ) : ఏమైందేమిటి?
రి.మి : కుర్రాడి రెస్యూమే చాలా బాగుంది . మొదటి సారి తన సొంత పేరు ఉన్న ఇమెయిల్ ఐడీతో పంపించాడు. రెండవ సారి సం ప్రదిస్తే , ” స్వీట్ బాయ్ లడ్డు అనే ఇ మెయిల్ ఐ డీ నుంచి నాకు రెప్లై ఇచ్చాడు !
నేను : అలాగా !
రి.మి : ఆ పిలగాడి తో చెప్పాను, ‘స్వీట్ బాయ్‌లడ్డు’ అనే ఇమెయిల్ ఐడీతో మెయిల్ ఐ డి నుంచి రాస్తే , అక్కడ ఐబీఎం కంప్యు టర్స్‌లో నిన్ను తీసుకోరు నాయనా ! అని ! అతనేమో ‘ఐ హ్యావ్‌మై ఓన్ రూల్స్
”అంటున్నాడు ! పైగా, అతని గర్ల్ ఫ్రండ్ అలా పిలుస్తుందట !
నేను : హీ హీ హీ ! ఇంకేమంటున్నాడు లడ్డు బాబు?
రి.మి : నీకేమి రా ? నవ్వులాటగా ఉంటుంది! ఏంటిరా ఈ ఇమెయిల్ ఐడిలు. ఆడ పిల్లలేమో, ‘డ్యాడ్స్ ప్రిన్సెస్’ అనీ, ‘ఐస్ క్రీం గర్ల్ అనీ ‘ ఇలా . బాయ్స్ ఏమో, లడ్డు అనీ, ‘క్రేజీ డ్యూడ్’ అనీ, ఇలాంటి ఇమెయిల్ ఐడీ ల నుంచి మెయిల్ పంపితే, టీసీయెస్‌లూ, ఇన్‌ఫోసిస్ లూ ఎలా కన్సిడర్ చేస్తాయి?
రిక్రూటర్ : అంటే, యువతరానికి టాలెంటు , నైపుణ్యం లేవని చెప్ప లేను. రెస్యూమే లు చాలా బాగున్నాయి . టెలిఫోన్ ఇంటర్వ్యూ చేశాను. బాగానే రెస్పాండ్ అయారు ! ఇదేంటి రా బాబు ?
నేను : ఇటీవలి సినిమాల ప్రభావం కావచ్చు . లేదా వీరికి జీవితంలో ఇంకా మొట్టికాయలు తగిలి ఉండవు . మన లాగా ! సరేలే ! ప్రస్తుతం అలాంటి ఇమెయిల్ ఐడీ ల నుంచి పెద్ద పెద్ద కంపెనీ లకు యధా తధం గా పంపకు . రెస్యూమేలనీ ల్యాప్ టాప్‌లోకి దౌన్ లోడ్ చేసి , నీ మెయిల్ నుంచి మీ క్లయింట్ లకి పంపు ! అని చెప్పాను. అసలే ఆర్ధిక మాంద్యం. మీరు ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్టు’ చూశారా ? ప్రజల ఆకలి తీర్చే విషయంలో మన దేశం ప్రపంచంలో నే 102 వ అధమ స్థానానికి దిగజారి పోయింది! పాకిస్తాన్ మనకంటే మెరుగుగా, 94 వ స్థానంలో ఉంది. వ్యవస్థలోని ఆర్ధిక మాంద్యా నికి, మనుషుల బుద్ధి మాంద్యం కూడ తోడు అయితే, ఉద్యోగం వేట కష్టమే! ఈ వారం మరియు వచ్చే వారం మన శీర్షికలో, ‘ఉద్యోగం వేటలో మనం చేయకూడని 10 విషయాలు ఏమిటో తెలుసుకుందాం ! మీ ప్రతిస్పందన తెలియజేయవలసిన ఇమెయిల్:essence.training@yahoo.com, punnami.news @gmail.com