*
*పున్నమి ప్రతినిధి పొదలకూరు*: పట్టణంలోని విగ్నేశ్వర కాలనీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుంచి పాత పద్ధతిలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని టిడిపి నాయకులు ఆధ్వర్యంలో చేపట్టారు. లబ్ధిదారులకు రేషన్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షుడు బొద్దులూరి మల్లికార్జున్ నాయుడు, కోవూరు బక్క నాయుడు, భోగ చంద్రశేఖర్ , తాటి బోయిన కిష్టయ్య,సీనియర్ నాయకుడు తల్లిగా ప్రసాద్,యువ నాయకులు జయ, కృష్ణ, బషీర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ పాత పద్ధతిలోనే రేషన్ పంపిణి ప్రక్రియ జరుగుతుందని ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మరియు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని, 65 సంవత్సరాల పైబడిన వయోవృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తామని తెలిపారు. పాత పద్ధతిలోనే ఈ రేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.