ఉదయాన్నే ప్రారంభమైన రేషన్ పంపిణీ: రామానాయుడు, ఏనుగు రఘు రామిరెడ్డి,

0
55

ఉదయాన్నే ప్రారంభమైన రేషన్ పంపిణీ

పున్నమి, జూన్ 1 (చేజర్ల ప్రతినిధి)

చేజర్ల మండలంలోని ఏటూరు గ్రామంలో ఈరోజు ఉదయం రేషన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గ్రామ కూటమి నాయకుల చేత రేషన్ షాప్‌ను ప్రారంభించి, బియ్యం, పంచదార, నిత్యావసర వస్తువులను గ్రామస్థులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది అని డీలర్ తెలిపారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామానాయుడు, ఏనుగు రఘు రామిరెడ్డి, నూతకి అంకయ్య పాల్గొని, స్వయంగా గ్రామస్తులకు రేషన్ సరుకులను అందజేశారు.

గ్రామ ప్రజలు పెద్దఎత్తున హాజరై ఈ సేవను స్వాగతించగా, ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ఈ రేషన్ పంపిణీ వంటి కార్యక్రమాలు సామాన్యులకు ఎంతో ఉపయోగకరమని నాయకులు అభిప్రాయపడ్డారు.

0
0