खबर की मुख्य बातें
- ఉదయగిరి పట్టణాన్ని ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది.
- పొగమంచు ప్రభావంతో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
- వాహనాలు పార్కింగ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా ప్రయాణించాయి.
ఉదయగిరి పట్టణాన్ని ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు ప్రభావంతో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు పార్కింగ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా ప్రయాణించాయి. రహదారులపై నడిచే పాదచారులు సైతం వాహనాలను గుర్తించలేక ఇబ్బందులు పడ్డారు. ఉదయం వేళ పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరగకుండా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.