నెల్లూరు వీఆర్ కాలేజీలో 1976-79 లో బీ.యస్సీ చదివిన మిత్రులు దాదాపు తొంభై మంది కుటుంబ సభ్యులు తో ఉన్న VRC గుర్తుకొస్తున్నాయి గ్రూపులో విభిన్నంగా తమ ఇళ్ళలో కూర్చుని లాక్ డౌన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రోజూ సాయంత్రం రకరకాల క్విజ్ లు జరుపుకుంటూ కుటుంబ సభ్యులు కలిసి వారి పిల్లలు ఇతర ప్రాంతాలలో ఉన్న వారితోనూ షేర్ చేసుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు. దేశంలో వివిధ ప్రాంతాలలోనూ..విదేశాలలోనూ విస్తరించి ఉన్న తమ మిత్రులు వారి కుటుంబ సభ్యులుకు సాయంత్రం ఐదు గంటలకు క్విజ్ మాష్టారు సత్యం రిటైర్డు సైన్సు టీచర్ ప్రశ్నా పత్రాన్ని విడుదలచేస్తారు. ఒకరోజు సినిమా పాటలు పెట్టీ అవి సినిమా లు హీరోహీరోయిన్లు చెప్పడం..సీన్లు ఆడియో పెట్టి ఏ సినిమా లోవో గుర్తించడం..అంత్యాక్షరి.. అలా..పాటలకు ఒక బిట్ వేస్తే పల్లవి చెప్పడం ఇలా దాదాపు పది రోజులుగా ప్రతిరోజు క్విజ్ లు…అందరూ వివిధ వృత్తుల్లో ఉండి రిటైరైనవారు…పిల్లలకూ ఆ క్విజ్ లు షేర్ చేసి ఒక గంట సమయంలో ఆ సమాధానాలు క్విజ్ మాష్టారు కు పర్సనల్ నెంబర్ కి పంపాలి. ఆ తరువాత ప్రతిరోజూ ఫలితాలు రాత్రికి అనౌన్సు చేస్తారు. లాక్ డౌన్ అనంతరం గ్రూపునుంచి బహూమతులూ ఇవ్వనున్నారు అని అడ్మిన్ నాగరాజరావు తెలిపారు. ఈ గ్రూపులో కరోనా పై అన్ని సందేశాలు ఫేక్ న్యూస్ బ్యాన్ చేసారు. అవసరమైన మేరకు అధికారిక సమాచారం మాత్రమే గ్రూపులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఉదయాన్నే ఏం క్విజ్ ఉంటుందో సత్యం మాష్టారు పోస్ట్ చేస్తారు. సరదాగా ఈ విధంగా క్విజ్ తో మిత్రులతో వీడియో వాయిస్ కాలింగ్ ద్వారా ఈ లాక్ డౌన్ ఎంజాయ్ చేస్తూ ఉన్న ఈ మిత్రబృందం నిజంగా స్పూర్తిదాయకమే…తాము నలభై మూడేళ్ళ క్రితం కలిసి చదువుకున్న ససమయంలో జరిగిన జ్ఞాపకాలనూ షేర్ చేసుకుంటూ….ఇలా…గడపడం ఇతరులకూ స్పూర్తి కావాలనీ…తమ గ్రూపులో రాజకీయ ప్రేరేపిత సందేశాలనూ…ఈ కరోనా పై వచ్చే అసత్య వార్తలనూ సంపూర్ణంగా నిషేధం అమలుచేస్తున్నట్లూ ఈ వీఆర్సీ గుర్తుకొస్తున్నాయి టీం తెలిపారు.