బుచ్చిరెడ్డిపాలెం ఏప్రిల్ 25 ( పున్నమి విలేఖరి )
బుచ్చిరెడ్డిపాలెము పట్టణంలో ఓ యువకుడు, ఓ అమ్మాయిని స్థానిక వైఎస్ఆర్ విగ్రహం సెంటర్ నుండి జొన్నవాడ సెంటర్ వరకు బైక్ పై ఫాలో చేస్తూ వచ్చి హెరైజ్ చేస్తుంటే ఆ యువతి చాలా సేపు అతనిని వారించినా లాభంలేక స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక యస్ ఐ ప్రసాద్ రెడ్డి సకాలంలో స్పందించి తన సిబ్బందిని పంపి ఆ యువకున్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఫోన్ చేసిన వెంటనే స్పందించిన పోలీసుల పనితీరుపై పలువురు ప్రజలు తమ మనో భావాలు పున్నమి విలేఖరికి తెలుపుతూ ఇంతకు ముందు కూడా ఇలానే బుచ్చి యస్ఐ ప్రసాద్ రెడ్డి వారి సిబ్బంది చాలా కేసుల విషయంలో తమదైన శైలిలో ప్రతిభ చూపించారంటూ ప్రజలందరూ హ్యట్సఫ్ టూ పోలీస్ అంటూ నినాదాలు చేశారు.