Home బిజినెస్ ఆర్ధిక మాంద్యంలో మన ఉద్యోగాలు కాపాడుకోవడం ఎలా ?

ఆర్ధిక మాంద్యంలో మన ఉద్యోగాలు కాపాడుకోవడం ఎలా ?
పున్నమి పాఠకులకు నమస్కారములు.
శుభోదయం. మా ‘వత్తి జీవితం’ శీర్షికని పునః ప్రారంభిస్తున్నాము అని తెలియ జేయడానికి సంతోషిస్తున్నాము. ప్రస్తుతం దేశంలో ఆర్ధిక మాంద్యం నడుస్తోంది. ఇది వాహన రంగాన్ని పెను తుఫానులా తాకింది. ప్రభుత్వ సంస్థ అయిన ‘బిఎస్‌ఎన్ ఎల్’ నుంచి ఏకబిగిని 32,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పను న్నారు. సాఫ్ట్ వేర్ రంగం తప్ప మిగతావి అంత సేఫ్‌గా లేవు!
కంపెనీ పెట్టిన 130 సంవత్సరాల తరు వాత పార్లే బిస్కెట్‌ల పరిశ్రమ ఫాక్టరీకి 10 రోజుల విరామం ప్రకటించారు. అదేంటో !! ప్రజలు బిస్కెట్‌లు తినడం కూడా తగ్గించేశారు! పార్లే జీ పెద్ద ఖరీదైనది కూడా కాదు! అందరికీ అందుబాటులో ఉండే ధర ! ఇలాంటి సమయంలో ‘ఉన్న ఉద్యోగం ఎలా కాపాడుకోవాలి’ అనే అంశం మీద మా సెకండ్ ఇన్నింగ్స్‌లో తొలి ఆర్టికల్ ప్రచురిస్తున్నాం . మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తాం. అదే అభద్రత , మనకి వచ్చినప్పుడు మనం ఏమేమి చేయాలో ఈ వారం, వచ్చే వారం చర్చిద్దాం .
ముఖ్య గమనిక. ఇప్పుడున్న ఆర్ధిక మాం ద్యం, మరొక 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో, మనల్ని ఎవరు రక్షించరు! మనల్ని మనమే రక్షించుకోవాలి. మనకి కావలసిన భద్రతా భావం (సెక్యూరిటీ) మనమే కల్పించుకోవాలి. మనము, లాభార్జన ధ్యేయంగా ఉన్న కంపెనీ (ఫర్‌ప్రాఫిట్ కంపెనీస్)లో పని చేస్తున్నాము అనుకోండి. మనం చేసే పని, కంపెనీ యొక్క ఆదాయాన్ని, మరియు లాభాన్ని ఏ విధంగా పెంచుతుందో, మనకి అవగాహన ఉండాలి. అది లేక పోతే, మన ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు! ఇంకా – ‘అలంకార ప్రాయమైన ఉద్యోగాలు ‘పర్సనల్ సెక్రెటరీ, పబ్లిక్ రిలేషన్స్ మేనేజరు, కార్పొరేట్ ఇమేజ్ మేనేజరు, అడ్వర్‌టైజింగులో ఉన్న వారు, కంపెనీ కష్ట పరిస్థితులలో ఉంటే తమ ఉద్యోగాన్ని నిలబెట్టుకోలేరు !
కొన్ని ఉదాహరణలు చూద్దాం. మీరు మానవ వనరుల మేనేజర్ (హెచ్‌ఆర్ ) అనుకోండి . ”మన కంపెనీకి అవసరమైన మధ్య స్థాయి మేనేజర్‌లను వేటాడడం నా బాధ్యత. క్రితం సంవత్సరం నేను ముగ్గురిని రిక్రూట్ చేశాను. ఒకరిని సేల్స్‌లో, ఒకరిని మార్కెటింగ్‌లో, ఒకరిని కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా. వీరి పనితనం వల్ల కంపెనీకి ఇంత లాభం వచ్చింది. వారిని మన పోటీ కంపెనీలు తన్నుకు పోకుండా, బాగా చూసు కున్నాను. ముగ్గురూ ఇప్పటికీ మన కంపెనీలోనే ఉన్నారు. ఇది కంపెనీ లాభానికి నా వంతు సహాయం” మీరు ప్రొడక్షన్ మేనేజర్ అనుకోండి. ”సకాలంలో ఉత్పత్తులకు , ప్రతి ఉద్యోగి తలసరి ఉత్పాదక శక్తి పెంచాను. వేస్టేజి తగ్గించాను. ఇన్ని లక్షలు / కోట్లు కంపెనీకి ఆదా చేసాను” ఇలా. మీరు ఫైనాన్స్ మేనేజర్ అనుకోండి. ”కంపెనీకి ఇంత ఖర్చు తగ్గించాను. ఇంత డబ్బు లాభంలో మిగిల్చాను. మంచి టాక్స్ ప్లానింగ్ ద్వారా, ఎక్కువ మొత్తం ఆదాయపు పన్నుకి పోకుండా కాపాడాను!” ఇలా.
సరే! చిన్న ఉద్యోగం ఉదాహరణ తీసు కుందాం. కొరియర్ డెలివరీ బాయ్, ఏ ఫ్లిప్ కార్ట్‌లోనో, అమెజాన్ లేదా స్నాప్‌డీల్‌లోనో పని చేస్తూ ఉన్నాడు అనుకుందాం. ‘నేను మన కనుగోలు దారులకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా టైం కి వారు ఆర్డర్ చేసిన వస్తువులు డెలివరీ చేశాను . తద్వారా, వారు మరొక్క సారి మన దగ్గర కొనే రిపీట్ కస్టమర్‌లని తయరు చేశాను’ ఇలా. కస్టమర్ సర్వీసులో లేదా రెసెప్షన్ కౌంటర్‌లో ఉన్న ఉద్యోగిని : కోపంగా వచ్చిన ఆ కస్టమర్‌ని శాంతింప జేసి, ఆమె సమస్య పరిష్కరించి పంపించాను. తద్వారా కస్టమర్‌ని కాపాడుకున్నాను. వారు మరొక్క కంపెనీకి వెళ్లకుండా ఆప గలిగాను’ ఇలా. ”నిన్ను ఉద్యోగంలో నుంచి ఎందుకు తీసి వేయకూడదు? ఎందుకు ఉంచాలి?” అని మనని యాజమాన్యం అడిగిందే అనుకుం దాం! మనం ఏ డిపార్టుమెంటులో ఉన్నా, మనకి అప్పగించిన పని ఏదైనా, మన పని వల్ల కంపెనీ ఆదాయం, మరియు లాభం ఎలా పెంచడానికి దోహదం చేసాయో, కాన్‌ఫి డెంట్‌గా చెప్పగలిగితే, మనకి ఉద్యోగ భద్రత ఉన్నట్లే. లేక పోతే లేనట్లె .
ఒక చిన్న పని : ఒక కాగితం తీసుకుని, మీరు చేసే పని వల్ల , మీ సంస్థకి యే విధంగా లాభమో, ఒక 4 లేక 5 కారణాలు రాయండి ! సమయం: 20 నిముషాలు. ఆ క్లారిటీ మీద ఎప్పుడూ ఉండండి. కంపెనీలు నడిపే యాజమాన్యం వారు, తమ సంస్థలో ఉన్న ఉద్యోగాలను 3 రకాలుగా చూస్తారు. (1) మనకి డబ్బు తెచ్చే ఉద్యోగాలు. (2) మనకి డబ్బు ఆదా చేసే ఉద్యోగాలు (3) మనకి డబ్బు ఖర్చు కలిగించే ఉద్యోగాలు . కంపెనీ ఆర్ధిక ఇబ్బందులలో ఉంటే, మొదటి వేటు, 3 వ కేటగిరీలో ఉన్న ఉద్యోగాల పైన పడుతుంది. అంతగా ప్రాముఖ్యం లేని ఉద్యో గాలు ఏమిటి ? అంటే ఇదమిద్ధంగా చెప్ప లేము. ఒక్కో కంపెనీని బట్టి, వారు చేసే వ్యాపారాన్ని బట్టి అవి మారుతుంటాయి. మనం చేసే పని ఆగి పోతే సంస్థ నడవదు అనిపించే ఉద్యోగాలు, ప్రాముఖ్యం కలిగినవి. మనం ఒక 4 నెలలు కంపెనీ కి వెళ్ళక పోయినా అది నడుస్తుంది అనిపించే ఉద్యోగాలు – అలంకార ప్రాయమైనవి. వాటిలో తాత్కాలిక సౌకర్యం ఉంటుంది కానీ, ఉద్యోగ భద్రత
ఉండదు, సుదీర్ఘ కాలంలో. మీ ప్రతిస్పందన
( ఫీడ్ బ్యాక్ ) తెలియజేయవలసిన ఇమెయిల్: essence.training@yahoo.com, punnami.news @gmail.com