తెలంగాణ స్టేట్ బ్యూరో, జూన్ 30 పున్నమి న్యూస్. ఆదర్శ్ వెల్ఫేర్ & ఎడ్యుకేషనల్ సొసైటీ (వృద్ధాశ్రమం) పాగిడి మహేందర్ రెడ్డి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని వెంకటేశ్వర గార్డెన్ వాసులు పాగిడి మహేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అనాధాశ్రమం ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ కు ఒకరు ఫీజుకు ఆర్థిక సాయం అందజేసిన దాతలు భవిష్యత్తులో కూడా తాను అండగా ఉంటానని ఆయన తెలిపారు. ఆ సంస్థ నిర్వాహకుడు ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాసరావు, ఆ సంస్థకు చెందిన గంగుల వెంకట్ రెడ్డి, ఆదర్శ్ వెల్ఫేర్ & ఎడ్యుకేషనల్ సొసైటీ (వృద్ధాశ్రమం) కల్పిస్తున్న వారిని ఆయన అభినందించారు. ఆశ్రమ నిర్వహణ కోసం తన వంతు సహకారం అందజేశానని భవిష్యత్తులో కూడా తాను అండగా ఉంటానని పాగిడి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు డి అంజనేయులు, జి దుర్గ ప్రసాద్ రెడ్డి, టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.