ఆత్మకూరు విద్యుత్‌ ‌శాఖ కార్యాలయంలో పాలనాధికారి లైంగిక వేధింపులు

0
846

ఆత్మకూరు, జూన్‌ 10, 2020 (‌పున్నమి విలేఖరి) : నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు విద్యుత్‌ ‌శాఖ కార్యాలయంలో పాలనాధికారి కామాండుద య్యాడు… మహిళా ఉద్యోగిని పట్ల కీచకుడిగా మారాడు..కోర్కె .. లైంగిక వాంచ తీర్చాలంటూ మూడునెలలుగా వెంట పడుతు న్నాడు… ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో సెలవుపై వెళ్లిన ఆ పాలనాధికారి తిరిగి విధుల్లోకి చేరేందుకు సిద్ధమ య్యాడు.. మళ్ళీ తన వక్రబుద్దిని చాటుకొంటున్నట్లు బాధిత మహిళా ఉద్యోగిని బావురమం టోంది…ఇంతకీ ఎవరా పాలనా ధికారి.. ఆ కామాంధుడి మాటలు, మెసేజీల పర్వం ఎలా ఉందో… బాధితురాలి మాటల్లో మీరే చదవండి.
నువ్వు నాకు నచ్చావ్‌….ఇం‌త ఫిజిక్‌, ఇం‌త ఫిట్‌గా ఎలా వున్నా వు? నిరంతరం నీవే గుర్తుకొస్తున్నావు. నిద్ర రావట్లా. నువ్వు నాకు ఫోన్‌ ‌చేయాలి. నా ఫోన్‌ ‌లిప్ట్ ‌చేయాలి. నీ అందం రహస్యాలు నాకు చెప్పాలి, చూపాలి. ఇవి విద్యుత్‌శాఖలోని ఓ పాలనాధికారి తమ దిగువ స్థాయి మహిళా ఉద్యోగిని పట్ల వ్యవహ రిస్తున్న తీరు. అడుగడుగునా ఫోన్‌లో మెసేజ్‌లు. దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతున్న ఆ అధి కారి లైంగిక వేధింపులతో విసిగి పోయిన ఆ ఉద్యోగిని ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించి పాలనాధికారికి మొట్టి కాయలు వేశారు. సెలవు పై వెళ్లమ న్నారు. అయినా అతని తీరులో ఏ మాత్రం మార్పు లేదు. చివరకు ఆ మహిళా ఉద్యోగిని కాపురంలో చిచ్చులు పెట్టాడు. అన్యోన్యంగా ఉన్న వారి మధ్య అగాధం ఏర్ప డింది. చివరకు దిక్కుతోచని స్థితి లో ఆ మహిళా ఉద్యోగిని తీవ్ర ఆందోళన చెందుతోంది..