खबर की मुख्य बातें
- పట్టణ చారిత్రక ప్రాధాన్యతను ప్రతిబింబించేలా నిర్మాణంబైపాస్ ప్రారంభ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు మంత్రి ఆనం సూచనలు ఆత్మకూరు, నవంబర్ 14 (కోటకొండ హరికిరణ్, పున్నమి ప్రతినిధి): జాతీయ రహదారిపై ఆత్మకూరు పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా సుందరమైన ఐకాన్ నిర్మాణానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి…
- పట్టణ చారిత్రక ప్రాధాన్యత, ప్రత్యేకతను ప్రతిబింబించేలా అత్యంత ఆకర్షణీయమైన ఐకాన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
- ఈ మేరకు శనివారం ఆత్మకూరు బైపాస్ రోడ్డు ప్రారంభ ప్రాంతాన్ని మంత్రి ఆనం సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.
పట్టణ చారిత్రక ప్రాధాన్యతను ప్రతిబింబించేలా నిర్మాణం
బైపాస్ ప్రారంభ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు మంత్రి ఆనం సూచనలు
ఆత్మకూరు, నవంబర్ 14 (కోటకొండ హరికిరణ్, పున్నమి ప్రతినిధి): జాతీయ రహదారిపై ఆత్మకూరు పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా సుందరమైన ఐకాన్ నిర్మాణానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణ చారిత్రక ప్రాధాన్యత, ప్రత్యేకతను ప్రతిబింబించేలా అత్యంత ఆకర్షణీయమైన ఐకాన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ మేరకు శనివారం ఆత్మకూరు బైపాస్ రోడ్డు ప్రారంభ ప్రాంతాన్ని మంత్రి ఆనం సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. జాతీయ రహదారి నుంచి ఆత్మకూరు పట్టణంలోకి ప్రవేశించే ప్రయాణికులకు పట్టణ ప్రత్యేకతను పరిచయం చేసే విధంగా ఐకాన్ నిర్మాణం ఉండాలని సూచించారు. కేవలం అలంకారప్రాయంగా కాకుండా ఆత్మకూరు చరిత్ర, సంస్కృతి, విశిష్టతను ప్రతిబింబించేలా నిర్మాణ నమూనా రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆత్మకూరు పట్టణ అభివృద్ధితో పాటు సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో బైపాస్ రోడ్డు ప్రారంభ ప్రాంతం కీలకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వారిని ఆకట్టుకునేలా ఐకాన్ రూపకల్పన ఉండాలని, పట్టణంలోకి అడుగుపెట్టగానే ఆత్మకూరుకు ప్రత్యేక గుర్తింపు కనిపించేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు.ఈ ఐకాన్ పట్టణ సుందరీకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. నిర్మాణానికి సంబంధించిన అంశాలను పరిశీలించి, పట్టణ ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా ముందుకు సాగాలని సూచించారు.
