संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
वारंगल

అశోక్ నగర్‌లో నాశనమైన పంట పొలాన్ని పరిశీలించిన. ఖానాపురం బిఆర్ఎస్ పార్టీ నాయకులు..

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అశోక్ నగర్‌లో నాశనమైన పంట పొలాన్ని పరిశీలించిన. ఖానాపురం బిఆర్ఎస్ పార్టీ నాయకులు..

నర్సంపేట నియోజకవర్గం, ఖానాపూర్ మండలం పరిధిలోని అశోక్ నగర్ గ్రామంలో దారుణంగా ధ్వంసమైన వరి పొలాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం పరిశీలించడం.
గ్రామానికి చెందిన రైతు బిఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ మెంబర్ స్వరూప, ఆమె భర్త శ్రీనివాస్‌కు చెందిన వరి పొలాన్ని కొంతమంది అజ్ఞాత వ్యక్తులు గడ్డి మందు కొట్టి, కొడవళ్లతో కోసి దారుణంగా నాశనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకులు వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని, దెబ్బతిన్న పంటను పరిశీలించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రెక్కల ముక్కలు చేసుకుని సాగు చేసుకున్న పంటను ఈ విధంగా నాశనం చేయడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య, ఖానాపూర్ మాజీ ఎంపీపీవేములపెల్లి ప్రకాష్ రావు,మాజీ AMC బత్తిని శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామసాయం ఉపేందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చ యాదగిరిరావు వార్డు మెంబర్ కాటిరేవుల మల్లికాంబ రమేష్ ముద్దంగుల అనిత ఏకాంతం,బంధారపు శ్రీనివాస్, యూత్ నాయకులు నరేష్ సురేష్ భూక్య రవి తదితరులు పాల్గొన్నారు.

అశోక్ నగర్‌లో నాశనమైన పంట పొలాన్ని పరిశీలించిన. ఖానాపురం బిఆర్ఎస్ పార్టీ నాయకులు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *