Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

అనకాపల్లిలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనకాపల్లిలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు!

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) ఇద్దరు అరెస్ట్..
  • 4.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం అనకాపల్లి, అక్టోబర్ 6: అనకాపల్లి పట్టణంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
  • ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రెండు స్నాచింగ్ కేసులను ఛేదించారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)

ఇద్దరు అరెస్ట్.. 4.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

అనకాపల్లి, అక్టోబర్ 6: అనకాపల్లి పట్టణంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రెండు స్నాచింగ్ కేసులను ఛేదించారు. వారి నుంచి సుమారు 4.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మహేందర్ సింగ్ గతంలో 36కు పైగా చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాపిడో బైక్ రైడర్‌గా పనిచేస్తున్న అతడు ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని బైక్‌పై వచ్చి బంగారు గొలుసులు లాక్కెళ్లేవాడని పేర్కొన్నారు. చోరీ చేసిన సొత్తును మండ్రు లత రత్నాకర్‌కు ఇచ్చి నగల దుకాణాల్లో విక్రయించేవాడని తెలిపారు. మే 22న అనకాపల్లి బొడ్డేడువారి వీధి, గాంధీనగర్‌లో జరిగిన రెండు చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. ఎస్ఐ ఎ.వెంకటేశ్వరరావు, క్రైమ్ సిబ్బంది ప్రత్యేక నిఘాతో నిందితులను పట్టుకున్నారు. టౌన్ సీఐ జి.ప్రేమకుమార్, ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *