అనంతసాగరం మండలం: గ్రామంలోని ఉన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీ ప్రసన్న గారు విద్యార్థినీ విద్యార్థులతో కలిసి కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో ప్రజలను జాగృతం చేసే ఈ విధంగా ర్యాలీ నిర్వహించారు .ఈ సందర్భంగా హెచ్ఎం లక్ష్మీ ప్రసన్న గారు మాట్లాడుతూ రెండో విడత కరోనా విజృంభిస్తుండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలోని అన్నీ వీధులను విద్యార్థినీ విద్యార్థులతో కలిసి కోవిద్ 19 గురించి జాగ్రత్తలు వివరిస్తూ మాస్కు తప్పని సరిగా ధరించాలని, శానిటైజర్ లు వాడాలని వ్యక్తిగత దూరం పాటించాలని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నినాదాలు చేస్తూ గ్రామమంతా ర్యాలీగా ప్రచారం చేయడం జరిగింది అనంతరం తమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 60 మందికి covid 19 పరీక్షలు చేయించడం జరిగిందని తెలిపారు. పిల్లలు అందరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని ఆరోగ్యంగా ఉండాలని కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలలో కరోనా వ్యాక్సిన్ పై గల అభిప్రాయాలను అనుమానాలను తొలగిపోయేలా పిల్లలకు వివరించి వారి ద్వారా కరోనా వ్యాక్సిన్ తమ తల్లిదండ్రులు చుట్టుపక్కల వారు 45 సంవత్సరాలు పైబడిన వారు తీసుకునేలా వివరించాలని చెప్పారు .గత పది రోజుల నుంచి కూడా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం లో భాగంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాటిలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగిందని తెలిపారు.