संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

విశ్వనాధరావుపేట లో లేళ్లపల్లి సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
విశ్వనాధరావుపేట లో లేళ్లపల్లి సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

खबर की मुख्य बातें

  • Uploaded Video:

బజార్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ.. గ్రామ అభివృద్ధికి ఐదు ప్రధాన హామీల ప్రకటన

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

విశ్వనాథరావుపేట గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశ్వనాథరావుపేటలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లేళ్లపల్లి సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని బజార్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బోగోలు జడ్పీటీసీ మాలేపాటి నాగేశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

**గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక**

ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి లేళ్లపల్లి సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహకారంతో విశ్వనాథరావుపేట గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఐదు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు.

1. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన రహదారుల కల్పన.
2. మెరుగైన వైద్య సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ.
3. విద్యార్థులు, యువతకు మెరుగైన అవకాశాల కల్పన.
4. రైతులకు సహకారం, వ్యవసాయ అభివృద్ధికి కృషి.
5. మహిళలు, వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత.

గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ఎన్నికల గుర్తు **ఉంగరం**పై, అలాగే వార్డు సభ్యుల అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులపై ఓటు వేసి, సర్పంచ్ అభ్యర్థిగా తనను, వార్డు సభ్యుల అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని లేళ్లపల్లి సుధీర్ కుమార్ ఓటర్లను కోరారు.

Uploaded Video:

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *