संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

విశాఖ అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం – పల్లా – మహిళా సాధికారతకు టీడీపీ పెద్దపీట వేస్తో

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
విశాఖ అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం – పల్లా – మహిళా సాధికారతకు టీడీపీ పెద్దపీట వేస్తో

గాజువాక, నవంబర్ 6 (పున్నమి ప్రతినిధి):

రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును విశాఖపట్నం నగర మేయర్ ముక్కా శ్రావణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి, ప్రజలకు అందించాల్సిన సేవలు, పార్టీ బాధ్యతలపై చర్చించారు.

ఈ సందర్భంగా మేయర్ ముక్కా శ్రావణి మాట్లాడుతూ విశాఖ నగర ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. మహిళా శక్తి, మహిళా సాధికారతకు పెద్దపీట వేసే పార్టీ టీడీపీ ఒక్కటేనని పేర్కొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కార్పొరేషన్‌లో సుమారు 60 మంది మహిళలకు అవకాశం కల్పించడం మహిళల పట్ల పార్టీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన పార్టీగా టీడీపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు.

పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు తమపై నమ్మకంతో మరింత బాధ్యత అప్పగించారని, ఆ బాధ్యతను పూర్తి శ్రద్ధతో నిర్వర్తిస్తామని చెప్పారు. విశాఖపట్నం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రపంచమంతా విశాఖ వైపు చూసేలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

విశాఖ అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం – పల్లా – మహిళా సాధికారతకు టీడీపీ పెద్దపీట వేస్తో

Leave a comment

Your email address will not be published. Required fields are marked *