खबर की मुख्य बातें
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయితీయందు ప్రస్తుతం గల 20 వార్డులను 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన మరియు ది.01-01-2026 పబ్లిష్ చేసిన వార్డుల వారీ ఫోటో ఎలక్ట్రోరల్ సంఖ్య ప్రాతిపదికన అన్ని వార్డులలో సరాసరి ఓటింగ్ శాతం ఉండునట్లు వార్డు సరిహద్దులను…
- 1994 ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలు/నగర పంచాయితీలు యాక్టులోని క్లాజ్ (1) రూల్ 4 ప్రకారం ముమ్మిడివరం నగర పంచాయితీని 23 వార్డులుగా పునర్విభజన చేయబడిన ముమ్మిడివరం నగర పంచాయితీని ప్రభుత్వం వారు జారీ చేసిన పరిమితులకు లోబడి వార్డు సరిహద్దులను విభజించుచూ జారీ చేసిన ఫైనల్ పబ్లికేషన్ కు…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయితీయందు ప్రస్తుతం గల 20 వార్డులను 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన మరియు ది.01-01-2026 పబ్లిష్ చేసిన వార్డుల వారీ ఫోటో ఎలక్ట్రోరల్ సంఖ్య ప్రాతిపదికన అన్ని వార్డులలో సరాసరి ఓటింగ్ శాతం ఉండునట్లు వార్డు సరిహద్దులను నిర్ణయించి 23 వార్డులుగా పునర్విభజన చేయవలసినదిగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా వార్డు సరిహద్దుల జాబితాను ముమ్మిడివరం నగర పంచాయతీ అధికారులు విడుదల చేశారు. 1994 ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలు/నగర పంచాయితీలు యాక్టులోని క్లాజ్ (1) రూల్ 4 ప్రకారం ముమ్మిడివరం నగర పంచాయితీని 23 వార్డులుగా పునర్విభజన చేయబడిన ముమ్మిడివరం నగర పంచాయితీని ప్రభుత్వం వారు జారీ చేసిన పరిమితులకు లోబడి వార్డు సరిహద్దులను విభజించుచూ జారీ చేసిన ఫైనల్ పబ్లికేషన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ నెం.411 ను జిల్లా కలక్టరు, డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, రెవెన్యూ డివిజనల్ అధికారి, అమలాపురం, మండల రెవెన్యూ అధికారి, ముమ్మిడివరం, మండల అభివృద్ధి అధికారి, ముమ్మిడివరం, సబ్ రిజిష్టర్ కార్యాలయము, ముమ్మిడివరం మరియు ముమ్మిడివరం నగర పంచాయితీ కార్యాలయ నోటీసు బోర్డుల యందు ప్రచురించడమైనదని పట్టణ ప్రజలకు తెలియజేస్తూ ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ బి రవివర్మ ప్రకటనను విడుదల చేశారు.