संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
ASIFABAD

వాంకిడి PHCలో బాధితులకు పరామర్శ – అన్ని రకాలుగా ఆదుకుంటామని బారోస

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
వాంకిడి PHCలో బాధితులకు పరామర్శ – అన్ని రకాలుగా ఆదుకుంటామని బారోస

खबर की मुख्य बातें

  • Uploaded Video:

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సోనాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన ఆదివాసీ తెగకు చెందిన సుర్పం ధర్ము, ఆత్రం గోదుబాయి, సిడం నాగుబాయి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) చికిత్స పొందుతున్నారు.

​ఈ విషయాన్ని తెలుసుకున్న *సోనాపూర్ సర్పంచ్ పంద్రం సురేష్* ఈ రోజు దావఖానాకు వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని, వారికి అరటి పండ్లను పంపిణీ చేశారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు.
​బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని అక్కడ ఉన్న వైద్యులకు, సంబంధిత అధికారులకు సర్పంచ్ సూచించారు.

​ఈ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు మాడవి బండు, మాడవి చందు, సింగం శ్రీనివాస్, సుర్పం జైరాం తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *