Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మాధవరం నగర్ కాలనీ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం నందు స్థానిక నాయకులతో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యం, అహింస, శాంతి, సహనం వంటి మహాత్మా గాంధీ చూపిన విలువలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ చేసిన సేవలు, ప్రజలను ఏకం చేసి అహింసా మార్గంలో నడిపించిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సత్యం, అహింస, స్వచ్ఛత, సామాజిక బాధ్యత వంటి విలువలను తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాల్గొని మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *