संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపాలిటీలో 48 కి పెరిగిన వార్డులు – ఉత్తర్వులు జారీచేసిన సీడీఎంఏ.

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • పల్నాడు జిల్లా నరసరావుపేట పుర పాలక సంఘం లో వార్డుల సంఖ్య పెరిగింది.
  • ఇప్పటి వరకు 38 వార్డుల గా ఉన్న సంఘాన్ని 48 వార్డుల గా పునర్విభజిస్తూ ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ( సీడీఎంఏ) డాక్టర్ సంపత్ కుమార్ ఉత్తర్వులు ( Roc.No.13032/2/2026/H/15) జారి చేశారు.
  • ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం-1965 మరియు పురపాలక నిబంధనల ప్రకారం ప్రభుత్వం కల్పించిన అధికారాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పల్నాడు జిల్లా నరసరావుపేట పుర పాలక సంఘం లో వార్డుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 38 వార్డుల గా ఉన్న సంఘాన్ని 48 వార్డుల గా పునర్విభజిస్తూ ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ( సీడీఎంఏ) డాక్టర్ సంపత్ కుమార్ ఉత్తర్వులు ( Roc.No.13032/2/2026/H/15) జారి చేశారు.

ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం-1965 మరియు పురపాలక నిబంధనల ప్రకారం ప్రభుత్వం కల్పించిన అధికారాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కౌన్సిల్‌లోని ఎన్నికైన సభ్యుల (వార్డుల) సంఖ్యను ఖరారు చేసే అధికారాన్ని ప్రభుత్వ జీవో ద్వారా పురపాలక శాఖ డైరెక్టర్‌కు అప్పగించడంతో, ప్రస్తుతంనున్న 38 వార్డులను 48 వార్డులకు పెంచుతూ అధికారిక ప్రకటన వెలువడింది. గౌరవ న్యాయస్థానాలలోని ఆదేశాలకు లోబడి ఈ నిర్ణయం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. సదరు ఉత్తర్వుల ప్రతులను పల్నాడు జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, గుంటూరు ప్రాంతీయ డైరెక్టర్, నరసరావుపేట ప్రత్యేక అధికారికి పంపించారు. వార్డుల సంఖ్య అదనంగా 10 పెరిగి 48కి చేరడంతో పట్టణంలో రాజకీయ సమీకరణాలు మారడంతో పాటు రాబోయే ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *