Story highlights
- గారపాటి దివ్య కుటుంబానికి అండగా నిలిచేందుకు జనసేన పార్టీ విజ్ఞప్తి తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 11 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి దేవరపల్లి ,దుమంతునిగూడెం గ్రామ జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన స్వర్గీయ గారపాటి దివ్య అకాల మరణం గ్రామ ప్రజలను, జనసేన పార్టీ…
- ఈ నేపథ్యంలో ఈరోజు దుమంతునిగూడెం గ్రామ జనసేన పార్టీ తరఫున రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ని కలిసి గారపాటి దివ్య కుటుంబ పరిస్థితులను, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించడం జరిగింది.
- దివ్య కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని మంత్రివర్యులను కోరడం జరిగింది.
గారపాటి దివ్య కుటుంబానికి అండగా నిలిచేందుకు జనసేన పార్టీ విజ్ఞప్తి
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 11
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
దేవరపల్లి ,దుమంతునిగూడెం గ్రామ జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన స్వర్గీయ గారపాటి దివ్య అకాల మరణం గ్రామ ప్రజలను, జనసేన పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ నేపథ్యంలో ఈరోజు దుమంతునిగూడెం గ్రామ జనసేన పార్టీ తరఫున రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ని కలిసి గారపాటి దివ్య కుటుంబ పరిస్థితులను, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించడం జరిగింది.
దివ్య కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని మంత్రివర్యులను కోరడం జరిగింది. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.