संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

ఎండాడలో ఏఐజి హాస్పిటల్ కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఎండాడలో ఏఐజి హాస్పిటల్ కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్

खबर की मुख्य बातें

  • రూ.2,000 కోట్ల పెట్టుబడి..
  • 9,000 మందికి ఉపాధి అవకాశాలు విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 31:: ఉత్తరాంధ్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా విశాఖపట్నంలోని ఎండాడ వద్ద ఏఐజీ (AIG) హాస్పిటల్స్ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, విద్యుత్ శాఖల మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేసి…
  • కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రజాప్రతినిధులు, ఏఐజీ హాస్పిటల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

రూ.2,000 కోట్ల పెట్టుబడి.. 9,000 మందికి ఉపాధి అవకాశాలు

విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 31:: ఉత్తరాంధ్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా విశాఖపట్నంలోని ఎండాడ వద్ద ఏఐజీ (AIG) హాస్పిటల్స్ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, విద్యుత్ శాఖల మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రజాప్రతినిధులు, ఏఐజీ హాస్పిటల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ ప్రాజెక్టుకు వచ్చే ఐదేళ్లలో దశలవారీగా రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. 9 ఎకరాల్లో నిర్మించే ఆస్పత్రిలో మొత్తం 1,000 పడకలు ఉండగా, మరో 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో 650 పడకలను 2028 అక్టోబర్ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఆస్పత్రిలో 50కి పైగా వైద్య విభాగాలతో పాటు ఏఐ రీసెర్చ్ సెంటర్, పారామెడికల్ ట్రైనింగ్ సెంటర్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్టుతో సుమారు 9,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విశాఖలోనే అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు పొందే అవకాశం కలగనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *