Story highlights
- చెన్నరావుపేట :( పున్నమి తెలుగు దినపత్రిక) చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 14 జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
- పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తేజావత్ జయ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చిలపాక అనిత, గ్రామ కార్యదర్శి కృష్ణంరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పరపల్లి సర్పంచ్ చిలపాక అనిత మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారు ఉన్నత లక్ష్యాలను…
- గ్రామ కార్యదర్శి కృష్ణంరాజు మాట్లాడుతూబాలల దినోత్సవం భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జరుపుకుంటామని, ఆయనకు పిల్లలంటే ఎంతో ప్రేమ అని తెలిపారు.
చెన్నరావుపేట 🙁 పున్నమి తెలుగు దినపత్రిక)
చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 14 జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తేజావత్ జయ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చిలపాక అనిత, గ్రామ కార్యదర్శి కృష్ణంరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పరపల్లి సర్పంచ్ చిలపాక అనిత మాట్లాడుతూ
నేటి బాలలే రేపటి పౌరులని, వారు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
గ్రామ కార్యదర్శి కృష్ణంరాజు మాట్లాడుతూబాలల దినోత్సవం భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జరుపుకుంటామని, ఆయనకు పిల్లలంటే ఎంతో ప్రేమ అని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకుని సన్మార్గంలో నడవాలని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా రూపుదిద్దుకోవాలని కోరారు.ప్రధానోపాధ్యాయురాలు తేజావత్ జయ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అన్నారు.అనంతరం విద్యార్థులకు బాలల ఆనందోత్సాహాల మధ్య వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు వ్యాయామ ఉపాధ్యాయురాలు వీరగోని స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News Sources
- PraveenPress release