Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

ఇన్స్పైర్ అవార్డులకు ఎంపికైన అక్కుర్తి హై స్కూల్ విద్యార్థులు

Punnami Newsroom Published:
ఇన్స్పైర్ అవార్డులకు ఎంపికైన అక్కుర్తి హై స్కూల్ విద్యార్థులు

Story highlights

  • శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు వైష్ణవి, జీవనరేఖ, మీనాక్షి ముగ్గురు విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ అవార్డులకు ఎంపిక కావడం గర్వకారణమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయ కుమారి తెలిపారు.
  • ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎంపిక చేయబడిన సైన్స్ ప్రాజెక్టులలో ఎంపిక అవడం ఎంతో ఆనందదాయకమని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, సరైన మార్గదర్శకత్వం లభిస్తే వారు అద్భుత విజయాలు సాధించగలరని మా విద్యార్థులు నిరూపించారని ఆమె పేర్కొన్నారు.
  • ఈ విజయానికి మార్గనిర్దేశం చేసిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీ ప్రకాశం రాజును ప్రత్యేకంగా అభినందించారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు వైష్ణవి, జీవనరేఖ, మీనాక్షి ముగ్గురు విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ అవార్డులకు ఎంపిక కావడం గర్వకారణమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయ కుమారి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎంపిక చేయబడిన సైన్స్ ప్రాజెక్టులలో ఎంపిక అవడం ఎంతో ఆనందదాయకమని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, సరైన మార్గదర్శకత్వం లభిస్తే వారు అద్భుత విజయాలు సాధించగలరని మా విద్యార్థులు నిరూపించారని ఆమె పేర్కొన్నారు. ఈ విజయానికి మార్గనిర్దేశం చేసిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీ ప్రకాశం రాజును ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఎంపిక కావడం పాఠశాలకు గౌరవకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు విద్యార్థులను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *