संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अनकापल्ली

ఆటో డ్రైవర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఆటో డ్రైవర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ

खबर की मुख्य बातें

  • పెద్దపల్లి దిమిలి ఆటో స్టాండ్ సభ్యులకు సూచనలు పెద్దపల్లి దిమిలి ఆటో స్టాండ్ సభ్యులతో ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ శనివారం సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
  • మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

పెద్దపల్లి దిమిలి ఆటో స్టాండ్ సభ్యులకు సూచనలు

పెద్దపల్లి దిమిలి ఆటో స్టాండ్ సభ్యులతో ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై ఆటోలను ప్రవేశపెట్టరాదని, ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రామకృష్ణ సూచించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, రికార్డులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటో స్టాండ్ సభ్యులందరూ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *