संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नंद्याल

అంతరిక్షంపై ఆసక్తి పెంచుకోవాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
అంతరిక్షంపై ఆసక్తి పెంచుకోవాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

खबर की मुख्य बातें

  • నంద్యాల : విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంచుకొని, ప్రయోగాత్మక అభ్యసనం, పరిశోధనా దృక్పథంతో భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ జి.
  • రాజకుమారి పిలుపునిచ్చారు.
  • బుధవారం నంద్యాలలోని ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇస్రో శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ఆమె ప్రారంభించారు.ఇస్రో ఎంపిక చేసిన దక్షిణ భారతదేశంలోని ఆరు కార్యక్రమ వేదికల్లో నంద్యాలకు చోటు దక్కడం గర్వకారణమన్నారు.

నంద్యాల : విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంచుకొని, ప్రయోగాత్మక అభ్యసనం, పరిశోధనా దృక్పథంతో భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాలలోని ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇస్రో శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ఆమె ప్రారంభించారు.ఇస్రో ఎంపిక చేసిన దక్షిణ భారతదేశంలోని ఆరు కార్యక్రమ వేదికల్లో నంద్యాలకు చోటు దక్కడం గర్వకారణమన్నారు. విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా ప్రయోగాలు, పరిశీలన, అన్వేషణ ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
అంతరిక్ష సాంకేతికతతో వాతావరణ అంచనాలు, తుఫాన్లు, వరదలపై ముందస్తు హెచ్చరికలతో పాటు వ్యవసాయంలో నేలతేమ, పంటల పరిస్థితిని తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని పెద్ద కలలు కని, వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.కార్యక్రమంలో షార్ ఇస్రో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్. శంకరన్, సీనియర్ శాస్త్రవేత్త టి. శ్రీనివాసరెడ్డి, శాస్త్రవేత్త ఆదిత్య, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *