✒️ *మహిళల భద్రత.. గంజాయి నిర్మూలన.. రోడ్డు భద్రతపై పోలీసుల అవగాకన
👉 సత్యవేడు: జిల్లా *ఎస్పీ* ఆదేశాల మేరకు *ఆపరేషన్ త్రిశూల్‌లో* భాగంగా సత్యవేడు మండలం వీఆర్ కండ్రిగ ఎస్సీ కాలనీలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సత్యవేడు *సీఐ మురళి,* *ఎస్సై టి. సాయినాథ్ చౌదరి,* పోలీసు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని స్థానికులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
👉 మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, మహిళల భద్రత, చట్టపరమైన రక్షణ చర్యలపై పోలీసు అధికారులు వివరించారు. గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలు, గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ఉన్న చట్టపరమైన చర్యలను ప్రజలకు తెలియజేశారు.
👉 అలాగే రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
👉 ప్రాంతంలో పలువురు సీసీటీవీ సంబంధిత విధుల్లో పనిచేస్తున్న నేపథ్యంలో ఇంటి వద్ద అధిక మొత్తంలో నగదు, విలువైన వస్తువులను ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. పగలు, రాత్రి వేళల్లో జరిగే ఇంటి దొంగతనాలను అరికట్టేందుకు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
👉 కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానిక ఉపాధ్యాయుడు చెంగయ్యతో పాటు పోలీసు సిబ్బంది, స్థానికులు కీలకంగా సహకరించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణకు పోలీసులతో కలిసి పనిచేయాలని అధికారులు పిలుపునిచ్చారు.


