పున్నమి ప్రత్యేక ప్రతి నిధి
డిల్లీ
ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రదన్ తో కలిసి తెలంగాణలోని సమ్మక్క సారక్క కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయం లోగోను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆవిష్కరణ చేశారు. ఈ సం దర్భముగా
కిషన్ రెడ్డి మాట్లాడుతూ
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంజూరు చేసిన ఈ విశ్వవిద్యాలయం నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని
ఈ యూనివర్సిటీ నిర్మాణం కోసం రూ.800 కోట్లు కేంద్రం కేటాయించడం జరిగింది అని గిరిజన విద్య, సంస్కృతి, సంప్రదాయాల పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం.అని అన్నారు
దేశంలో తొలిసారిగా గిరిజన భాషలను ఉపయోగించి విశ్వవిద్యాలయం లోగోను రూపొందించడం విశేషం అని అన్నారు
గిరిజన సమాజాల అభ్యున్నతికి, సంక్షేమానికి అనునిత్యం పాటుపడుతున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ శ్రీ వై. ఎల్. శ్రీనివాస్ , ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


