Thursday, 30 April 2026
  • Home  
  • విశాఖలో మహాకవి శ్రీశ్రీ జయంతి వేడుకలు ఘనంగా
- ఆంధ్రప్రదేశ్

విశాఖలో మహాకవి శ్రీశ్రీ జయంతి వేడుకలు ఘనంగా

జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) గారి 116వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా శ్రీశ్రీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీశ్రీ గారు సాహిత్య విప్లవానికి మార్గదర్శకుడిగా, పీడిత ప్రజల తరఫున అభ్యుదయ కవిత్వాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ‘మహాప్రస్థానం’ వంటి రచనలతో తెలుగు సాహిత్యంలో కొత్త దిశను చూపారన్నారు. వేలాది సినీ గీతాలతో తెలుగు పాటలకు కొత్త అర్థం ఇచ్చిన ఆయనకు సాహిత్య అకాడమీ, జాతీయ చలనచిత్ర, నంది పురస్కారాలు లభించాయి. ఈ సందర్భంగా ఆయన కవిత్వం ప్రాధాన్యతపై పాఠకులకు వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి బుర్రి కుమార్ రాజు, లైబ్రేరియన్ పి.వి. నూకరాజు, వర్మతో పాటు విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) గారి 116వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా శ్రీశ్రీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
శ్రీశ్రీ గారు సాహిత్య విప్లవానికి మార్గదర్శకుడిగా, పీడిత ప్రజల తరఫున అభ్యుదయ కవిత్వాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ‘మహాప్రస్థానం’ వంటి రచనలతో తెలుగు సాహిత్యంలో కొత్త దిశను చూపారన్నారు. వేలాది సినీ గీతాలతో తెలుగు పాటలకు కొత్త అర్థం ఇచ్చిన ఆయనకు సాహిత్య అకాడమీ, జాతీయ చలనచిత్ర, నంది పురస్కారాలు లభించాయి.
ఈ సందర్భంగా ఆయన కవిత్వం ప్రాధాన్యతపై పాఠకులకు వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి బుర్రి కుమార్ రాజు, లైబ్రేరియన్ పి.వి. నూకరాజు, వర్మతో పాటు విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.