వర్షాలు కురవాలని ముస్లిం సోదరుల ప్రత్యేక నమాజు
మంథని, ఆగస్టు 07, పున్నమి ప్రతినిధి; పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ముస్లిం మైనారిటీ సోదరులు గురువారం పట్టణ పరిధిలోని గోదావరి తీరంలో ప్రత్యేక నమాజు నిర్వహించారు. సంవృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు, ప్రజలకు అల్లా దయ, కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పట్టణంలోని సాలెహా మజీద్ కు చెందిన ఇమాంసాబ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. అనంత కరుణామయుడు అల్లా దయతో ప్రకృతి కటాక్షించి సంవృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక నమాజులు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా వరుసగా మూడు రోజులు నమాజులు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రతిరోజు చేసే నమాజుకు ఈ ప్రార్థనలు ప్రత్యేకమని వివరించారు.

ఇదే క్రమంలో ముస్లిం పెద్దలు సర్దార్ ఖాన్, మక్బూల్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వానాకాలం వచ్చి దాదాపు రెండు నెలలు దాటినా ఇంతవరకు పరిసర ప్రాంతాల్లో సరైన వానలు లేక ప్రజలు అల్లాడుతున్నారని, వర్షాలు లేకుంటే రైతులకు సరైన పంటలు పండక అవస్థలు పడుతున్నారని, అల్లా దయతో వర్షాలు కురిసి, పంటలు పండితే ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.
మంథని పట్టణంలోని సాలెహా మజీద్ కమిటీ అధ్యక్షుడు యాకూబ్, ఆఫిజ్, ఎండీ లతీఫ్, మజీద్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అలీం ఖాన్, చాంద్, అక్బర్, శంశీర్, షాహిద్, ఐసన్, నిజాం, అంజద్, అజీమ్, హైమద్, బాబా, మోహిన్, పట్టణ ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.


