संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

వరికుంటపాడు బీసీ హాస్టల్ పునఃప్రారంభానికి అధికారుల పరిశీలన

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
వరికుంటపాడు బీసీ హాస్టల్ పునఃప్రారంభానికి అధికారుల పరిశీలన

खबर की मुख्य बातें

  • వరికుంటపాడు: మండలంలోని బీసీ హాస్టల్‌ను తిరిగి ప్రారంభించేందుకు అధికారుల పరిశీలన చివరి దశకు చేరుకుంది.
  • త్వరలోనే హాస్టల్ పునఃప్రారంభం కానుందని వరికుంటపాడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
  • హాస్టల్ అందుబాటులోకి వస్తే బీసీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

వరికుంటపాడు: మండలంలోని బీసీ హాస్టల్‌ను తిరిగి ప్రారంభించేందుకు అధికారుల పరిశీలన చివరి దశకు చేరుకుంది. త్వరలోనే హాస్టల్ పునఃప్రారంభం కానుందని వరికుంటపాడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. హాస్టల్ అందుబాటులోకి వస్తే బీసీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు వసతి సదుపాయం అందుబాటులోకి రావడంతో చదువుపై మరింత శ్రద్ధ పెట్టేందుకు అవకాశం కలుగుతుందన్నారు. సంబంధిత అధికారులు పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, హాస్టల్ ప్రారంభానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. హాస్టల్ పునఃప్రారంభంతో విద్యార్థుల వసతి సమస్యలు తగ్గి, విద్యాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి త్వరితగతిన హాస్టల్‌ను ప్రారంభించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *