संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

యూనాని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
యూనాని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

खबर की मुख्य बातें

  • ఉదయగిరి: మండల ప్రజలు యూనాని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారిణి నిశాంత్ అఫ్రిన్ సూచించారు.
  • సోమవారం ఉదయగిరి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో యూనాని వైద్య సేవల శిబిరాన్ని నిర్వహించారు.
  • ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన పలువురు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.

ఉదయగిరి: మండల ప్రజలు యూనాని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారిణి నిశాంత్ అఫ్రిన్ సూచించారు. సోమవారం ఉదయగిరి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో యూనాని వైద్య సేవల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన పలువురు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు మందులను క్రమం తప్పకుండా వినియోగిస్తే వ్యాధులను నియంత్రించడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉన్న యూనాని వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫార్మాసిస్టు విప్లవకుమారి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *