Wednesday, 3 June 2026
  • Home  
  • యువతకు బంగారు అవకాశం – శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళా
- తిరుపతి

యువతకు బంగారు అవకాశం – శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళా

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జయంతి సందర్భంగా ఈనెల 15వ తేదీ బుధవారం పట్టణంలోని స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలు కలిగిన యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మెగా జాబ్ మేళాలో 50కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని వివిధ ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. యువత తమ అర్హతలకు అనుగుణంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, క్లస్టర్ ఇంచార్జ్ కంట రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.