విశాఖపట్నం, అక్టోబర్ 19:
రాష్ట్రవ్యాప్తంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, 49వ వార్డు బూత్ నెం.25 పరిధిలో స్థానిక నాయకులు నిర్వహించిన సంతకాల సేకరణలో ప్రధాన అతిథిగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, జి.వి.ఎమ్.సి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకరరావు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి గడపకు వెళ్లి ప్రజల సంతకాలను స్వయంగా సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ కాలేజీలు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రైవేటీకరణతో వైద్యం ఖరీదై, సామాన్యులకు అందని ద్రవ్యమవుతుంది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమై పోరాడాలి,అని ఆయన పిలుపునిచ్చారు.
అలాగే “కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వానికి ప్రజల అభిప్రాయాన్ని, నిరసనను బలంగా తెలియజేయడం మన కర్తవ్యమని” పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పల్లా చైతన్య, వార్డు కార్యదర్శులు ఆర్. వెంకటరావు, జెడ్. ప్రసాంత్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు రిసు చిన్నరావు, బీసీ సెల్ అధ్యక్షుడు కోన డిల్లీరావు, యువత అధ్యక్షుడు ఇగలపాటి రాజేష్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురపల్లి ఆనంద, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గల్ల రాంబాబు, మున్సిపాలిటీ వింగ్ అధ్యక్షుడు లంక వెంకట సుధాకర్, పబ్లిసిటీ విభాగం అధ్యక్షురాలు సోమరపాటి కనకమహాలక్ష్మి, సీనియర్ నాయకులు ఎస్. రాజు, ఎస్. హైమా, బి. దుర్గ తదితరులు పాల్గొన్నారు.


