संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
चित्तूर

బోయకొండ గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన టీడీపీ ఇన్‌ఛార్జ్ వై. మధుసూదన్ నాయుడు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
బోయకొండ గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన టీడీపీ ఇన్‌ఛార్జ్ వై. మధుసూదన్ నాయుడు

పుంగనూరు చౌడేపల్లి, అక్టోబర్ 12 (భాను ప్రసాద్ నాయుడు పున్నమి న్యూస్ ప్రతినిధి):
చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో సోమవారం అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీ వై. మధుసూదన్ నాయుడు సతీసమేతంగా ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న మధుసూదన్ నాయుడు దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో వెలసిన గంగమ్మ తల్లికి శాస్త్రోక్తంగా అర్చనలు, అభిషేకాలు, విశేష హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరూ పాడిపంటలు, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన కూటమి నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
(సతీసమేతంగా విశేష పూజలు నిర్వహించిన పుంగనూరు కూటమి నేత)
(నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు)

బోయకొండ గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన టీడీపీ ఇన్‌ఛార్జ్ వై. మధుసూదన్ నాయుడు

బోయకొండ గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన టీడీపీ ఇన్‌ఛార్జ్ వై. మధుసూదన్ నాయుడు

బోయకొండ గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన టీడీపీ ఇన్‌ఛార్జ్ వై. మధుసూదన్ నాయుడు

బోయకొండ గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన టీడీపీ ఇన్‌ఛార్జ్ వై. మధుసూదన్ నాయుడు

బోయకొండ గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన టీడీపీ ఇన్‌ఛార్జ్ వై. మధుసూదన్ నాయుడు

బోయకొండ గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన టీడీపీ ఇన్‌ఛార్జ్ వై. మధుసూదన్ నాయుడు

బోయకొండ గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన టీడీపీ ఇన్‌ఛార్జ్ వై. మధుసూదన్ నాయుడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *