బీజేపీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన మర్శకుంట్ల స్వర్ణాకర్ నియమితులయ్యారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంతి కుమార్, ఖమ్మం లో స్వర్ణాకర్కు నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా స్వర్ణాకర్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. నియామకంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసి స్వర్ణాకర్కు అభినందనలు తెలిపారు.



