బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ తన కూతురు రాహాపై అపారమైన ప్రేమను ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె చేసిన ఒక పనితో రాహా భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ధనిక చిన్నారిగా గుర్తింపు పొందింది.
రాహా పాలు తాగే వయసులోనే రూ. 250 కోట్ల విలువైన బంగ్లాను తన పేరిట రాసిచ్చినట్లు అలియా తెలిపింది. ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అలియా మాట్లాడుతూ –
“తల్లిగా నేను ఆమె కోసం ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాను. రాహా టీనేజ్‌లోకి వచ్చేసరికి, నేను ఆమెకు ఊహించని ఒక పెద్ద ఆశ్చర్యాన్ని ఇవ్వబోతున్నాను,” అని చెప్పింది.
ఈ విధంగా అలియా భట్ తన కూతురి భవిష్యత్తును ముందుగానే భద్రపరిచేలా తీసుకుంటున్న చర్యలు, ఆమెపై చూపుతున్న ప్రేమను తెలియజేస్తున్నాయి.


