संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

నగిరిపాడు దశాబ్దాల కలకు తారు బాట! – రూ.1.20 కోట్లతో కొత్త రహదారి నిర్మాణం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
నగిరిపాడు దశాబ్దాల కలకు తారు బాట! – రూ.1.20 కోట్లతో కొత్త రహదారి నిర్మాణం

खबर की मुख्य बातें

  • చిట్వేల్: ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న నగిరిపాడు గ్రామ ప్రజల నిరీక్షణకు తెరపడింది.
  • చిట్వేలు - కోడూరు ప్రధాన రహదారి నుంచి నగిరిపాడు గ్రామం వరకు నూతనంగా నిర్మించిన తారు రహదారి గురువారం ప్రారంభమైంది.
  • రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి రహదారిని ప్రారంభించారు.

చిట్వేల్: ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న నగిరిపాడు గ్రామ ప్రజల నిరీక్షణకు తెరపడింది. చిట్వేలు – కోడూరు ప్రధాన రహదారి నుంచి నగిరిపాడు గ్రామం వరకు నూతనంగా నిర్మించిన తారు రహదారి గురువారం ప్రారంభమైంది. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి రహదారిని ప్రారంభించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షణలో నాబార్డ్ నిధులతో సుమారు రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో రహదారిని నిర్మించారు. గతంలో సరైన మార్గం లేక గ్రామస్థులు వైద్య సేవలు పొందేందుకు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, రైతులు పంటలను మార్కెట్లకు తరలించేందుకు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొత్త తారు రహదారి అందుబాటులోకి రావడంతో గ్రామానికి రాకపోకలు సులభతరం కానున్నాయి. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కస్తూరి విశ్వనాథ నాయుడు, తాతం శెట్టి నాగేంద్ర, విశ్వేశ్వర నాయుడు, కాకర్ల నాగార్జున, గుత్తి నరసింహ, పంచాయతీరాజ్ అధికారులు, ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *