संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
यादाद्री भुवनगिरि

దుర్గామాత శరన్నవరాఉత్సవాలలో భాగంగా అన్న ప్రసాద వితరణ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
దుర్గామాత శరన్నవరాఉత్సవాలలో భాగంగా అన్న ప్రసాద వితరణ

खबर की मुख्य बातें

  • ఈరోజు భువనగిరి పట్టణ 10వ వార్డు హౌసింగ్ బోర్డ్ భక్త భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ దుర్గా మాత శరన్నవరాత్రోత్సవాలు 6వ రోజు సందర్భంగా ఇలియాస్ మహమ్మద్ గారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ 10వ వార్డు…

ఈరోజు భువనగిరి పట్టణ 10వ వార్డు హౌసింగ్ బోర్డ్ భక్త భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ దుర్గా మాత శరన్నవరాత్రోత్సవాలు 6వ రోజు సందర్భంగా ఇలియాస్ మహమ్మద్ గారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ 10వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ గారు 26వ వార్డు కౌన్సిలర్ ఈరపాక నరసింహ 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కుల మతాలకు దుర్గ మాత శరన్నవరాఉత్సవాలు ఎంతో వైభవంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగింది భారతదేశంలో లౌకికతత్వానికి భిన్నత్వంలో ఏకత్వంలో సాంప్రదాయ పరిస్థితులను అనుసరించి భువనగిరిలో కూడా దుర్గామాత వద్ద కులాలకు మతాలకు అతీతంగా మైనార్టీ సోదరులు పూజలు నిర్వహించి అన్న ప్రసాద దాతగా నిలవడమే చారిత్రాత్మక విషయం అని ప్రజలందరూ కొనియాడడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు శీలం క్రాంతి రెడ్డి బింగి నరేష్ చిన్న సందీప్ రాజా మల్ల భరత్ వంశీ శ్రీకాంత్ శివ తిలక్ సాయి అఖిల్ బిట్టు మాటూరి బాలేశ్వర్ అమానత్ ఇమ్రాన్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొనడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *