తెలంగాణలో వాతావరణ సూచనలు..
తెలంగాణలో కూడా పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావారణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ సహా.. పలు జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయఇ.. అలాగే రాష్ట్రంలోని కొన్ని పశ్చిమ జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

