खबर की मुख्य बातें
- నందలూరు మండలానికి చెందిన జనసేన యువ నాయకుడు తిప్పాయపల్లి ప్రశాంత్ జన్మదిన వేడుకలు శనివారం రాజంపేట పట్టణంలోని యల్లటూరు భవన్‌లో ఘనంగా నిర్వహించారు.
- మాజీ జెడ్పీటీసీ, జనసేన ప్రముఖ నాయకులు యల్లటూరు శివరామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రశాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిబద్ధతతో పనిచేస్తూ జనసేన సిద్ధాంతాల కోసం ప్రశాంత్ చేస్తున్న కృషిని…
- పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తున్నారని పేర్కొన్నారు.పదవులను ఆశించకుండా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేసే ప్రశాంత్ వంటి కార్యకర్తలే జనసేనకు అసలైన బలమని నాయకులు అన్నారు.
నందలూరు మండలానికి చెందిన జనసేన యువ నాయకుడు తిప్పాయపల్లి ప్రశాంత్ జన్మదిన వేడుకలు శనివారం రాజంపేట పట్టణంలోని యల్లటూరు భవన్‌లో ఘనంగా నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ, జనసేన ప్రముఖ నాయకులు యల్లటూరు శివరామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రశాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిబద్ధతతో పనిచేస్తూ జనసేన సిద్ధాంతాల కోసం ప్రశాంత్ చేస్తున్న కృషిని నాయకులు కొనియాడారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తున్నారని పేర్కొన్నారు.పదవులను ఆశించకుండా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేసే ప్రశాంత్ వంటి కార్యకర్తలే జనసేనకు అసలైన బలమని నాయకులు అన్నారు. భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రశాంత్‌ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.