खबर की मुख्य बातें
- చిట్వేలు: మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని 30వ ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ కడప కమాండింగ్ అధికారి కల్నల్ ఎన్.
- సూర్యనారాయణమూర్తి ఆదేశాల మేరకు చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సిసి ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో లో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్ పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ క్యాడట్లతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
చిట్వేలు: మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని 30వ ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ కడప కమాండింగ్ అధికారి
కల్నల్ ఎన్. సూర్యనారాయణమూర్తి ఆదేశాల మేరకు చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
ఎన్సిసి ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో లో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్ పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ క్యాడట్లతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఎన్‌సీసీ క్యాడెట్లకు ‘స్వచ్ఛతా సే సమృద్ధి’ అంశంపై స్లోగన్ రైటింగ్ పోటీలు, ‘స్వచ్ఛ పర్వ్–హరిత్ పర్వ్’ అంశంపై వేస్ట్ టు ఆర్ట్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
అనంతరం ఎన్‌సీసీ క్యాడెట్లు పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. దేశ నాయకులు, ప్రముఖుల చిత్రపటాలను శుభ్రపరిచి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు మహాత్మా గాంధీ జీవితం, సిద్ధాంతాలు, దేశానికి ఆయన చేసిన సేవలపై ఉపాధ్యాయులు తిరుమల విశ్వనాథం, కళావతి, ప్రవీణ్, రమాదేవి, లత, అనూష ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.