संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
चित्तूर

చాలాకాలం తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి తమన్నా (కుటుంబ సభ్యులతో కలిసి వేంకటేశ్వర స్వామి సేవలో ప్రముఖ కథానాయిక)

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
చాలాకాలం తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి తమన్నా (కుటుంబ సభ్యులతో కలిసి వేంకటేశ్వర స్వామి సేవలో ప్రముఖ కథానాయిక)

खबर की मुख्य बातें

  • తిరుమల, అక్టోబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయిక తమన్నా భాటియా దర్శించుకున్నారు.
  • చాలాకాలం తర్వాత తిరుమల క్షేత్రానికి విచ్చేసిన ఆమె, తన తండ్రితో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
  • ఆలయానికి చేరుకున్న తమన్నాకు అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

తిరుమల, అక్టోబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయిక తమన్నా భాటియా దర్శించుకున్నారు. చాలాకాలం తర్వాత తిరుమల క్షేత్రానికి విచ్చేసిన ఆమె, తన తండ్రితో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న తమన్నాకు అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు శ్రీవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. చాలా రోజుల తర్వాత తిరుమలేశుడిని దర్శించుకోవడం ఎంతో మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో తమన్నా కనిపించడంతో అభిమానులు, భక్తులు ఆమెను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *