संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

ముథోల్, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి ):ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంతింటి కల నెరవేరిన ముథోల్ మండలంలోని అష్ట కాలనీలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. లబ్ధిదారు వడ్ల వందన–పెంటన్న దంపతుల నూతన గృహంలో సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, గృహ నిర్మాణ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సావిత్రి కోటయ్య, వార్డు సభ్యులు సురేష్, చిన్నన్న, ఈజీఎస్ ఎఫ్ఎ రాజేశ్వర్, యువ నాయకుడు మురళి, సేవాలాల్ అధ్యక్షుడు అనిల్, గాయకులు దిగంబర్, ఎస్‌కే మీనాజ్, సాయన్న, లక్ష్మణ్, వడ్ల బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *