కొనసీమ ముద్దుబిడ్డ కి ఘనంగా పుట్టినరోజు వేడుకలు..
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా
పి. గన్నవరం మండలం రాజులపాలెం లో మాజీ లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా రాజులూ పాలెం పంచాయతీ ఏనుగుకాలువ వంతెన వద్ద ఎర్పాటు చేసిన బాలయోగి విగ్రహానికి పూల మాలతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు,ఈ కార్యక్రమంలో రాజులూపాలెం మాజీ ఎంపీటీసీ నక్కా వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ నేడు స్వర్గీయలు బాలయోగి ఉంటే నేడు కొనసీమకు రైల్వే వచ్చేది, ప్రభుత్వలు వస్తున్నాయి పోతున్నాయి మా కొనసీమ ప్రాంతం అభివృద్ధి పట్టించుకునే వారే లేరని వెంటనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చొరవ చూపి మా కొనసీమ ప్రజల చిరకాల కోరిక రైల్వే పనులు పూర్తి చేయాలనీ కోరటం జరిగింది, ఈ కార్యక్రమంలో నీటి సంఘ అధ్యక్షులు కొలనడ సత్యనారాయణ రాజు, మట్టపర్తి నాగార్జున, టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు



