खबर की मुख्य बातें
- ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్సీపీ మండల స్థాయి విస్తృత సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
- అక్టోబర్ 6న ఉదయం 10 గంటలకు వరికుంటపాడు మండలంలో, సాయంత్రం 4 గంటలకు కొండాపురం మండలంలో సమావేశాలు జరుగుతాయని పేర్కొంది.
- అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు ఉదయగిరి మండలంలో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్సీపీ మండల స్థాయి విస్తృత సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 6న ఉదయం 10 గంటలకు వరికుంటపాడు మండలంలో, సాయంత్రం 4 గంటలకు కొండాపురం మండలంలో సమావేశాలు జరుగుతాయని పేర్కొంది. అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు ఉదయగిరి మండలంలో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆయా మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ముఖ్య నాయకులు సమావేశాలకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.