संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

खबर की मुख्य बातें

  • -ఎస్సై అనూక్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ స్ట్రీట్‌లో అవగాహన కార్యక్రమం పామూరు, అక్టోబర్ 3 ( పున్నమి ప్రతినిధి ): ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అనూక్‌ సూచించారు.
  • పామూరు పట్టణంలోని కందుకూరు రోడ్డులో భగత్‌సింగ్‌ స్ట్రీట్‌లో శనివారం ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఎస్సై అనూక్‌ మాట్లాడుతూ సైబర్‌ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

-ఎస్సై అనూక్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ స్ట్రీట్‌లో అవగాహన కార్యక్రమం

పామూరు, అక్టోబర్ 3 ( పున్నమి ప్రతినిధి ): ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అనూక్‌ సూచించారు. పామూరు పట్టణంలోని కందుకూరు రోడ్డులో భగత్‌సింగ్‌ స్ట్రీట్‌లో శనివారం ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అనూక్‌ మాట్లాడుతూ సైబర్‌ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు అధికారులు, ప్రభుత్వ శాఖల పేర్లతో ఫోన్‌ చేసి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీ, పిన్‌ నంబర్లు అడిగే వ్యక్తులను నమ్మవద్దని ఎస్సై అనూక్‌ తెలిపారు. బ్యాంకు అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ, పిన్‌, పాస్‌వర్డ్‌ వంటి రహస్య వివరాలను ఫోన్‌లో అడగరని చెప్పారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయవద్దని ఎస్సై అనూక్‌ సూచించారు. గుర్తుతెలియని యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దన్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే పెట్టుబడి పథకాలు, ఉద్యోగాల పేరుతో వచ్చే సందేశాలు, బహుమతులు గెలుచుకున్నారంటూ వచ్చే ఫోన్‌కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌, బ్యాంకింగ్‌, డిజిటల్‌ చెల్లింపుల సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్సై అనూక్‌ సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే సమీప పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు ఆన్‌లైన్‌ మోసాలకు గురికాకుండా ముందుగానే అవగాహన కల్పించాలని ఎస్సై అనూక్‌ కోరారు. అప్రమత్తతతోనే సైబర్‌ నేరాలను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *