संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

ఆనందపురం కేజీబీవీకి…మరో కీర్తి కిరీటం. టైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ధనలక్ష్మి

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఆనందపురం కేజీబీవీకి…మరో కీర్తి కిరీటం. టైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ధనలక్ష్మి

खबर की मुख्य बातें

  • ఆనందపురం కేజీబీవీ విద్యార్థినికి ఘన విజయం – అభినందనల వెల్లువ విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, అక్టోబర్ 8 (పున్నమి ప్రతినిధి) :: ఆనందపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)కు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ధనలక్ష్మి అండర్‌–17- 44 kg విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు…
  • అని pet బి.
  • రమాదేవి తెలిపారు క్రీడల్లో తన ప్రతిభను చాటుకుంటూ జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ధనలక్ష్మి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల KGBV విద్యార్థినులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

ఆనందపురం కేజీబీవీ విద్యార్థినికి ఘన విజయం – అభినందనల వెల్లువ

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, అక్టోబర్ 8 (పున్నమి ప్రతినిధి) ::
ఆనందపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)కు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ధనలక్ష్మి అండర్‌–17- 44 kg విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు, ఆనందపురం ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. అని pet బి. రమాదేవి తెలిపారు

క్రీడల్లో తన ప్రతిభను చాటుకుంటూ జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ధనలక్ష్మి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల KGBV విద్యార్థినులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

“ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే… విజయానికి హద్దులుండవు!”

విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థినులను ప్రోత్సహిస్తున్న ఆనందపురం KGBVలో ధనలక్ష్మి సాధించిన ఈ విజయం మరెంతో మంది బాలికలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. రాష్ట్రస్థాయిలోనూ ధనలక్ష్మి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ధనలక్ష్మి సాధించిన ఈ విజయంపై పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి దొండా చంద్రకళ, , పేరెంట్స్ కమిటీ చైర్మన్ కొప్పల పావని. వైస్ చైర్మన్ వరలక్ష్మి. కమిటీ సభ్యులు సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *