Tuesday, 29 September 2026
  • Home  
  • అమలాపురంలో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి రావడం అభినందనీయం: చింతా అనురాధ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురంలో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి రావడం అభినందనీయం: చింతా అనురాధ

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : అమలాపురంలోని కిమ్స్ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆంకాలజీ (క్యాన్సర్) విభాగం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో హాస్పిటల్ అధినేత శ్రీ చైతన్య రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు శ్రీ చిర్ల జగ్గిరెడ్డితో కలిసి అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతా అనురాధ మాట్లాడుతూ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు అత్యాధునిక వైద్య చికిత్సలు ఇకపై అమలాపురంలోనే అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. స్థానికంగానే మెరుగైన క్యాన్సర్ వైద్యం అందుబాటులోకి రావడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఖరీదైన వైద్యం కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. అమలాపురంలో ఆధునిక సదుపాయాలతో ఆంకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేసిన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కిమ్స్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, అమలాపురం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, పి.గన్నవరం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్, నాయకులు, హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
అమలాపురంలోని కిమ్స్ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆంకాలజీ (క్యాన్సర్) విభాగం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో హాస్పిటల్ అధినేత శ్రీ చైతన్య రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు శ్రీ చిర్ల జగ్గిరెడ్డితో కలిసి అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చింతా అనురాధ మాట్లాడుతూ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు అత్యాధునిక వైద్య చికిత్సలు ఇకపై అమలాపురంలోనే అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. స్థానికంగానే మెరుగైన క్యాన్సర్ వైద్యం అందుబాటులోకి రావడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఖరీదైన వైద్యం కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు.

అమలాపురంలో ఆధునిక సదుపాయాలతో ఆంకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేసిన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కిమ్స్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, అమలాపురం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, పి.గన్నవరం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్, నాయకులు, హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.