संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

అంబటి వెంకటసుబ్బమ్మ గెలుపు దిశలో ప్రచారం సాగాలి !!!పార్టీ శ్రేణులకు గంగసాని పిలుపు!!!

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
అంబటి వెంకటసుబ్బమ్మ గెలుపు దిశలో ప్రచారం సాగాలి !!!పార్టీ శ్రేణులకు గంగసాని పిలుపు!!!

खबर की मुख्य बातें

  • పామూరు,అక్టోబర్ 29(పున్నమి అధికార ప్రతినిధి ) పామూరు మండల జడ్పీటీసీ ఎన్నికల ప్రచారపర్వంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది..
  • అటు టీడీపీ, ఇటు వై.
  • ఎస్.ఆర్.

పామూరు,అక్టోబర్ 29(పున్నమి అధికార ప్రతినిధి ) పామూరు మండల జడ్పీటీసీ ఎన్నికల ప్రచారపర్వంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.. అటు టీడీపీ, ఇటు వై. ఎస్.ఆర్. సీపీ పార్టీ అభ్యర్థులు బరిలో ఉండటంతో, జడ్పీటీసి ఎన్నికలు సజావుగా జరుతాయనే నమ్మకంతో వున్న ఓటరు, తమ ఓటుహక్కుని వినియోగించుకునేందుకు సిద్ధంగా వున్నాడు.. భారత రాజ్యాంగం లోని 326 ఆర్టికల్ ప్రకారం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు స్వేచ్చ వాతావరణంలో ఓటు హక్కును వినియోగించి, తమకు నచ్చిన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే విధంగా ప్రభుత్వం రక్షణ కల్పించాలి.. దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యనికి చీకటిరోజులు కమ్ముకొని, అమావాస్యచంద్రుడి రూపంలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఓటు హక్కుఅనే ప్రాధమిక హక్కు ప్రమాదకోరల్లో చిక్కుకున్నట్టు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.. ఇలాంటి ప్రమాద వాతావరణం నుంచి ఓటరు బయటపదాలంటే ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగాలి.. ఇలాంటి ప్రజాప్రతినిధుల ఎన్నికల నిర్వహణ ఎజెండాగా వై. యస్. ఆర్. పార్టీ జడ్పీటీసి ఎన్నికల ప్రచారం కొనసాగిస్తుంది..వచ్చే నెల 5 వ తేదీన జరుగబోయే మండల స్థాయి జిల్లా పరిషత్ ఎన్నికలో వై. సి. పి. పార్టీ బలపరిచిన అభ్యర్థి అంబటి వెంకటసుబ్బమ్మ గారి ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, వై. సి. పి. కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు విశేషంగా పాల్గొని ప్రచార కార్యక్రమం జయప్రదం చేశారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *