संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

అంగన్వాడీ టీచర్ల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
అంగన్వాడీ టీచర్ల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి

అక్టోబర్ 07 పున్నమి ప్రతినిధి
నిర్మల్ జిల్లాలో 89 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల వారీగా అందిన దరఖాస్తుల వివరాలు, అర్హతల పరిశీలన, ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ టీచర్ల భర్తీ ప్రక్రియలో అర్హత కలిగిన అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, ప్రతి దశను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. దరఖాస్తుదారులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను పకడ్బందీగా పరిశీలించాలని, ఎలాంటి సందేహాలకు అవకాశం లేకుండా అవసరమైన స్థాయిల్లో పత్రాలను మరోసారి ధ్రువీకరించుకోవాలని ఆదేశించారు. భర్తీ ప్రక్రియకు సంబంధించిన సమాచారం, తదుపరి దశల వివరాలను దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. మండల, గ్రామ స్థాయిల్లో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అర్హత పత్రాల పరిశీలనను పూర్తి చేయాలని తెలిపారు. అంగన్వాడీ టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే, పారదర్శకంగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, భర్తీ చేయిస్తామని చెప్పే వ్యక్తులకు ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని ఆయన సూచించారు. భర్తీ ప్రక్రియకు సంబంధించి అధికారిక సమాచారం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వినూత్న, సీడీపీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ టీచర్ల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *